Pawan and Mahesh comments on the Janata curfew:
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా ఈ ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సెలబ్రిటీల నుంచి వీర లెవెల్లో స్పందనలు వస్తున్నాయి. ప్రజలందరూ ఆదివారం ఉదయం గం.7 నుంచి రాత్రి గం. 9 వరకు బహిరంగ ప్రదేశాలలోకి రాకుండా ఇంటిపట్టునే ఉండాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ఇప్పుడందరూ స్వాగతిస్తున్నారు. ఈ మెసేజ్‌ను అందరికీ చేరవేసేందుకు సెలబ్రిటీలందరూ తమ వంతు బాధ్యతగా తీసుకుని ప్రచారం చేసేస్తున్నారు.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వీడియో ద్వారా ‘ప్రధాని మాట పాటిద్దాం – కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం’ అని తెలిపారు. ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టింద ని, అందుకే ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో పవన్ అభిమానులు ఫిదా అయ్యారు. కర్ఫ్యూ పాటించడానికి సమాయత్తం అవుతున్నారు.
అలాగే టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ కూడా ట్విట్టర్ ద్వారా మోదీ సందేశాన్ని అందరికీ తెలియజేశారు. ‘మనల్ని రక్షించడానికి కరోనాపై ఫైట్ చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేద్దాం. ప్రధాని చెప్పినట్లు మన బాల్కనీలలో నిలబడి దద్దరిల్లిపోయేలా చప్పట్ల సౌండ్‌తో వారిని గౌరవించుకుందాం. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి’అంటూ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో సూపర్ స్టార్ ఫాన్స్ కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించడానికి సమాయత్తం అవుతున్నారు.