Tuesday, April 13, 2021

Latest Posts

అసలు ఆ ఉద్దేశ్యమేలేదన్న పవన్

బిజెపితో పొత్తుపెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడుతూ, అర్జెంటుగా గద్దెనెక్కాలనే ఆశ తనకు లేదని, అధికారమే లక్ష్యమైతే రాజకీయం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకు అవసరమయ్యే భావజాలం జనసేనకు ఉందని, అందుకే జనసేనలో కలిసి నడవాలని బీజేపీ పొత్తుపెట్టుకుందన్నారు. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌లా.. జనసేనకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది చెబుతున్నారని తెలిపారు.

అయితే డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలకు వెళ్లడం ప్రస్తుత పరిస్థితిలో అసాద్యమని పవన్ తేల్చిచెప్పారు. రాజకీయ నేతలు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాలన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. సమాజాన్ని విడగొట్టడం చాలా తేలిక, కలపడం కష్టమని పవన్‌ స్పష్టంచేసారు.

కాగా తెలంగాణలో కూడా జనసేనతో కలిసి పనిచేస్తామని, త్వరలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో భేటీ అవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో పవన్‌ సేవలు తీసుకుంటామని తెలిపారు. జనసేన-బీజేపీ కలిసి సీఎం కేసీఆర్‌ అవినీతి కుటుంబ పాలనను దించుతామని ఆయన హెచ్చరించారు. మెజారిటీ లేని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ దొడ్డిదారిన మున్సిపల్ ఛైర్మన్‌ పదవి చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. 100 సీట్లు గెలిచినా టీఆర్‌ఎస్‌కు తృప్తి లేదని, బీజేపీ గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ఇలా చేయడం సరికాదన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss