పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ మళ్ళీ కలవనున్నారు. చాలా గ్యాప్ తర్వాత కెమేరా ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్, క్రిష్ తో ఒక సినిమా, హరీష్ శంకర్ సినిమా లతో బిజీ బిజీగా వచ్చే రోజుల్లో గడుపబోతున్నారు. కాకపోతే ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కలిసి మళ్ళీ సినిమా చెయ్యబోతున్నారు. పవన్ కల్యాణ్ మిగిలి ఉన్న రెండు సినిమాలు కంప్లీట్ చేయగా ఆ సమయంలో త్రివిక్రమ్ ఎన్టిఆర్ తో కలిసి హారిక హస్సీనీ క్రెయాషన్స్ సంస్థలో ప్లాన్ చేసిన సినిమాను ఆ గ్యాప్ లో తీసి తరువాత పవన్ కల్యాణ్ తో సినిమాను పట్టలెక్కించనున్నారు త్రివిక్రమ్. కాగా వీరిద్దరి కలయికలో వచ్చిన పవన్ కల్యాణ్ 25 మూవీ అజ్ఞ్యాతవాసి అంతగా ప్రేక్షకులను అలరించకపోగా ఈ వచ్చే సినిమా మీద ఫాన్స్ ఆశలు పెట్టుకోవడం సహజం. ఇప్పుడు రాబోయే సినిమా మునుపటి సూపర్ హిట్ అత్తరింటికి దారేదిలా హిట్ అవ్వాలని ఆశిద్దాం.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం