Home రాజకీయం జనసైనికుల సేవ శాశ్వతం – పవన్ ప్రశంస

జనసైనికుల సేవ శాశ్వతం – పవన్ ప్రశంస

pawan kalyan congratulated the Janasena soldiers in twitter

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. మనదేశంలో కూడా లాక్ డౌన్ పొడిగింపు కొనసాగుతోంది. అయితే  కరోనా ఆంక్షలతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు,రాజకీయ పార్టీలు, వదాన్యులు చేయూతనిస్తున్నారు.  ఇక జనసేన సైనికులు అండగా నిలుస్తున్నారు.  నిత్యావసరాలు, ఆహారం, మాస్కులు పంపిణీ చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసైనికులను పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.

‘‘మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది అనే మాట మహాత్ముడు చెప్పారు. కోవిడ్-19 మహమ్మారితో ఉపాధి కోల్పోయి నిస్సహాయంగా ఎదురుచూస్తున్న ఆపన్నులకు అండగా నిలుస్తున్న జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులకు ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

పార్టీ కార్యాలయానికి అందుతున్న సమాచారం మేరకు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఎటువంటి సహాయ సహకారాలు చేస్తున్నారో తెలుసుకుంటున్నా మని పవన్ తెలిపారు.  ‘కొందరు  గుప్త దానాలు కూడా చేస్తున్నారు. వారు తమ పేర్లను కూడా బయట ప్రపంచానికి వెల్లడించుకోవడంలేదు. అటువంటి వారందరికీ, మీ దాతృత్వానికి నా అభినందనలు, జేజేలు, ‘జనసేవ’లో జనసేన అనునిత్యం మమేకం కావాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌ ట్వీట్ లో  పేర్కొన్నారు

Exit mobile version