మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటం అటు మెగా ఫ్యామిలీని , అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక చిరంజీవికి కరోనా సోకడం పై ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అన్నయ్య త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చిరంజీవికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా రావడంతో ఆయన త్వరగానే కోలుకుంటారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. “అన్నయ్య త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా .. లాక్డౌన్ విధించిన దగ్గర నుంచి అన్నయ్య చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజల్లో చైతన్యం నింపడానికి ఆయన వంతు కృషి చేసారు. సామాజిక బాధ్యతతో పలు కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన కలిపించారు. ఎలాంటి లక్షణాలు లేవు.. పరీక్షలో మాత్రం పాజిటివ్ అని వచ్చింది. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ త్వరగా రావాలని కూడా కోరుకుంటున్నాను” అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ కోరారు.
ఇది కూడా చదవండి: