Monday, May 10, 2021

Latest Posts

నేను త్వరగానే కోలుకొని మీ ముందుకు వస్తాను పవన్ కళ్యాణ్

Pawan Kalyan Health Condition

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయన త్వర గా కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్ధిస్తున్నారు. ప్రస్తుతం పవన్ హైదరాబాద్‏లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తొలిసారి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు పవన్.

కరోనా భారిన పడిన తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని.. వీలైనంత త్వరగా కోలుకోని మీ ముందుకు వస్తానని తెలిపారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని పవన్‌ సూచించారు. తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన పార్టీ నేతలు, జన సైనికులు మరియు అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేను. ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి మీతోపాటే ప్రజల కోసం నిలబడతాను అని తెలిపారు.

ఇకపోతే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 7 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం మరింత సన్నద్ధతతో వ్యవహరించాలి. ఏపిలో కరోనా భారిన పడిన వారికి కావాల్సిన బెడ్స్, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్ణకరం. అంచనా వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది అంటూ జనసేనాని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss