Pawan kalyan re-tweet on chiranjivi’s twitter post
ఏప్రిల్ 8వ తేదీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అదేమిటో ఆ రోజే చెబుతానని 8వ తేదీకి రెండు రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్‌తో అందరిలో ఆసక్తి కల్గించింది. చెప్పినట్లుగానే ఏప్రిల్ 8వ తేదీ రోజు తన లైఫ్‌లో ఉన్న విశేషాన్ని మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసాడు. 1962లో లాటరీలో హనుమంతుని బొమ్మ ఒకటి వచ్చిందని, అప్పటి నుండి ఆ బొమ్మను తనవద్దే భద్రంగా దాచుకున్నానని చిరంజీవి తెలిపారు. నా కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం హనుమంతుని మాదిరిగా ఉన్నాయని మా నాన్నగారు అనే వారని చిరంజీవి పేర్కొన్నారు.
అంతేకాదు, ఆ తరువాత ప్రఖ్యాత దర్శకులు బాపు ఒక సందర్భంలో హనుమంతుని బొమ్మ గీస్తుండగా మీ పోలికలే వచ్చాయని చెప్పారని, ఆ తరువాత తన ఇంట్లో పెట్టుకునేందుకు హనుమంతుని చిత్రం ఒకటి ఆయన చిత్రీకరించి పంపారని చిరు తెలిపారు. ఆ చిత్రాన్ని పాలరాతిపై రీ ప్రొడ్యూస్ చేసుకుని ప్రస్తుతం పూజ గదిలో భద్రంగా ఉంచి పూజిస్తున్నానని చిరంజీవి ఏప్రిల్ 8న తన ట్విట్టర్లో తెలిపారు. అన్నయ్య ట్వీట్ పై తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ ట్వీట్ చేసాడు.
‘అన్నయ్య చిరంజీవిగారి ద్వారా హనుమంతుడు మా ఇంట కొలువుదీరారు. ఆ తరువాత కమ్యూనిస్ట్ భావాలున్న మా నాన్నగారు కూడా శ్రీరామునికి అపరభక్తునిగా మారిపోయారు. అలాగే నేను కూడా అప్పట్లో యుక్త వయసులో ఉన్నపుడు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవాడిని. జై హనుమాన్’’ అని అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌ని పవన్ రీట్వీట్ చేసాడు. ఒక్క చిరంజీవే కాదు కల్యాణ్ పేరు ముందు పవన్ అని చేర్చుకుని పవన్ కల్యాణ్‌గా పేరు మార్చేసుకున్నాడు. ఇక హనుమంతుడిని ఎంతగా ఆరాధిస్తారో తాజాగా పవన్ చేసిన ట్వీట్‌తో చెబుతోంది.