Sunday, June 20, 2021

Latest Posts

వకీల్‌సాబ్ కోసం పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నాడంటే

Pawan Kalyan Remuneration

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌నటించిన లేటెస్ట్‌ మూవీ వకీల్‌సాబ్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే‌. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్‌ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఏపప్రిల్ ‌9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వకీల్‌సాబ్‌కు కోసం పవన్‌ కళ్యాణ్ ఏకంగా 65 కోట్లు తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్‌గా 50 కోట్ల, లాభాల్లో 15 కోట్లు వాటాగా తీసుకున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నివేదా థామస్‌కు 75 లక్షలు, అంజలి 50 లక్షలు, అనన్యకు 25 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కు భారీ రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం.

ఇక కరోనా సెకండ్ వేవ్ పుంజుకోవడంతో వకీల్‌సాబ్‌ మూవీను త్వరలోనే ఓటీటీలో రిలేజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చిత్ర దర్శకుడు దిల్ రాజు. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో వారు బంపర్ ఆఫర్ ఇచ్చారని, వచ్చేనెలలోనే ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss