Monday, July 26, 2021

Latest Posts

ప్రేక్షకుల మనస్సు కొల్లగొట్టనున్న హరి హర వీర మల్లు

Pawan Kalyan To Steal Hearts With Hari Hara Veera Mallu

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం హరి హర వీర మల్లు ప్రారంభం నుంచి వార్తల్లో నిలిచింది. 17 వ శతాబ్దంలో మొగల్స్ మరియు కుతుబ్ షాహిస్ శకం నాటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు, తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి హైదరాబాద్‌లో ఒక భారీ ఆగ్రా కోటను నిర్మించాలని చిత్ర నిర్మాతలు యోచిస్తున్నారు.

అంతే కాకుండా ఈ చిత్రం కోసం ఫిల్మ్ యూనిట్ ప్రత్యేక చార్మినార్ సెట్ మరియు మరికొన్ని చారిత్రక సెట్లను నిర్మించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అద్భుత సెట్లకు భారీ విఎఫ్ఎక్స్ జోడించి ప్రేక్షకుల మనస్సు కొల్లగొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతక ముందు ఎప్పుడు పీరియాడిక్ చిత్రంలో నటించని పవన్ ఈ సినిమాతో తన విశ్వరూపాన్ని చూపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss