Home రాజకీయం పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం యాక్షన్

పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం యాక్షన్

Pawan Kalyan Tweet Got Response From Chief Minister

Pawan Kalyan Tweet Got Response From Chief Minister:

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతా   లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూలీలు ఆగిపోయారు. అయితే  ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి పై తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి స్పందించారు. వివరాల్లోకి వెళ్తే,శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు చేపల వేట నిమిత్తం తమిళనాడు వరకు వెళ్లారు. అయితే లాక్ డౌన్ విధించడంతో వారు చెన్నై హార్బర్ లో నిలిచిపోయారు. వారికి భోజనం వసతి లేక అలమటిస్తున్న విషయం వారి కుటుంబ సభ్యుల ద్వారా జనసేన నేతలకు తెలిసింది.

ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో ఏపీ మత్స్యకారులకు తగిన సదుపాయాలు కల్పించి వారిని సంరక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రికి పవన్ కోరారు. దీనిపై  తమిళనాడు సీఎం స్పందిస్తూ, ‘ప్రియమైన పవన్ కల్యాణ్ మత్స్యకారుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖను ఆదేశించాం. వారిని మేం తప్పకుండా ఆదుకుంటాం. కృతజ్ఞతలు’ అంటూ  బదులిచ్చారు. ఈమేరకు ట్వీట్ చేసారు. కాగా   మ‌త్స్యకారుల ఇబ్బందుల‌ను నివారించ‌డానికి త‌న వంతు పాత్ర‌ను పోషించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, అందుకు తగినట్లు స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రిని తెతెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర్‌రాజన్ అభినందిస్తూ,  ట్విట్ట‌ర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.

Exit mobile version