Pawan Kalyan Warns YS Jagan
పవన్ కళ్యాణ్ ఈ మధ్య దూకుడు పూర్తిగా తగ్గించేశాడు. ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేటపుడు కూడా ఆయన మాటలు పదునుగా ఉండట్లేదు.ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలా కష్టం అని.. దూకుడు పెంచాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నా పవన్ మాత్రం సాఫ్ట్‌గానే మాట్లాడుతున్నాడు. అయితే ఇటీవల వరద వల్ల నష్టపోయిన రైతుల కోసం పార్టీ తరఫున పోరాటం మొదలుపెట్టిన పవన్.. స్వరం మార్చాడు. తాజాగా మచిలీపట్నం పర్యటనలో పవన్ అధికార పార్టీ మీద పదునైన పంచ్‌లు విసిరి అభిమానుల్లో వేడి పుట్టించారు.
తన కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ పేరును పవన్ ఈ పర్యటన ఉచ్ఛరించడం విశేషం. తనపై తరచుగా విమర్శలు చేస్తున్న పేర్ని నానీని ఉద్దేశించి పవన్ పంచ్ డైలాగులు పేల్చాడు. ‘‘శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అంటారు. అలాగే శతకోటి నానీల్లో ఒక నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్‌కు చిడతలు కొడితే కొట్టుకో, నన్ను తిడితేనే నీ మంత్రి పదవి ఉంటుందంటే తిట్టుకో నాకేం పర్వాలేదు. కానీ రైతులకు అండగా నిలబడాలి. ఏమయ్యా నానీ నువ్వు నన్ను తిట్టింది చాల్లే కానీ పోయి పనికొచ్చే పని ఏదైనా చేయవయ్యా.” అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
ఇంకా జనసేన లీడర్ పవన్ మాట్లాడుతూ,”వైసీపీ నాయకులారా.. శృతిమించితే మీపై పోరాటం చేస్తాం. ఈ విషయం సీఎం సాబ్‌కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. రైతులకు న్యాయం చేయకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొస్తాం జాగ్రత్త. మీ వైఎస్సార్ సీపీ నాయకులు నాయకులు నోరేసుకుని రోడ్లమీదకు వస్తే మేము రాలేమనుకుంటున్నారా జగన్ రెడ్డీ. మేము కూడా రోడ్లమీదకు వస్తాం సిద్ధంగా ఉండండి, తేల్చుకుందాం రైతులకు ఎకరానికి 35 వేలు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం ఇది తథ్యం సీఎం సాబ్. కానీ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం రోడ్డుకు మీదకు తీసుకోస్తాం. మీరు జనసేనకు భయపడి అసెంబ్లీ సమావేశాలు పులివెందులలో పెట్టుకున్నా సరే వచ్చి ముట్టడిస్తాం జాగ్రత్త’’ అంటూ పవన్ వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చారు ఏపీ సిఎం జగన్ కి.
ఇవి కూడా చదవండి: