Home సినిమా వార్తలు లుంగీ మడతేసి కొడుతున్న భీమ్లా నాయక్‌

లుంగీ మడతేసి కొడుతున్న భీమ్లా నాయక్‌

Pawan Kalyan's first look as Bheemla Nayak out

Pawan Kalyan’s first look as Bheemla Nayak out

భారీ మల్టీ స్టారర్ చిత్రమైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానాల చిత్రం టైటిల్‌, ఫస్ట్ గ్లింప్స్ చిత్రయూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నా విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గాను కొన్ని షూటింగ్ స్పాట్ లోని వీడియోలు బయటకు రావడంతో సినిమా మిద అంచనాలు పెరిగిపోయాయి. అ అంచనాలకు తగ్గటుగా ఈ రోజు ఫస్ట్ గ్లింప్స్ తో భీమ్లా నాయక్‌ వచ్చేసాడు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఉదయం 9.45 గంటలకు ఈ భీమ్లా నాయక్‌ ఫస్ట్ గ్లింప్స్  రీలీజ్ చేసారు మేకర్స్.

ఇందులో పవన్ లుంగీ మడతేసి వీరావేశంతో అరెయ్ డానీ బయటకు రారా నా కొడకా అంటూ అరుస్తూ రౌడీలను కొడుతుంటే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. చివర్లో భీమ్లానాయక్ కి ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని వినిపించడం కొస మెరుపు.  ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన ఎస్ నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

ఇది కూడా చదవండి:  

 

 

Exit mobile version