Thursday, January 21, 2021

Latest Posts

‘వకీల్‌సాబ్’కి హీరోయిన్ ఎందుకు దొరకలేదు

Pawankalyan New movie Vakheel sab Heroin conformed?

రాజకీయాల్లో జోరుగా ఉంటూనే మరోపక్క సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మొదటగా ‘వకీల్‌సాబ్’లో కమిట్ అయ్యాడు. పింక్ హిందీ మూవీకి రీ మేక్ గా తీస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. దీన్ని బట్టి పవన్ సరసన నటించేందుకు ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదనే వార్తలే వినిపిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కల్యాణ్ సినిమా అంటే చిన్న అవకాశం వచ్చినా చాలు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించడానికి ముందుకి రావడం లేదంట. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు తెరమీదికి వచ్చాయి.

ఇలా ఉంటె, ‘వకీల్‌సాబ్’ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ చేసే చిత్రానికి హీరోయిన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. కానీ పింక్ చిత్రానికే ఎందుకు హీరోయిన్ సెట్టవ్వక పోవడానికి ఈ సినిమాలో హీరోయిన్‌ రోల్‌కి ఉండే ప్రాముఖ్యత అలాంటిదట.

నిజమే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదట. రెండు మూడు సీన్లు, రెండు పాటలు తప్ప పెద్దగా స్కోప్ లేని పాత్రని చేయడం ఇష్టం లేకే ఎవ్వరూ ముందుకు రావడం లేదంట.
ఈ చిత్రంలో మొదట్లో శృతిహాసన్ సెలక్ట్ అయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆమె రీసెంట్‌గా ఖండించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఒరిజినల్‌గా ‘పింక్’లో పవన్ చేసే పాత్రకు హీరోయిన్, పాటలు ఉండవట. కానీ పవన్ కల్యాణ్ కావడంతో తెలుగులో ఈ స్క్రిఫ్ట్‌లో మార్పులు చేశారని, హీరోయిన్ సీన్స్‌ని యాడ్ చేశారని అంటున్నారు. మరి ప్రాముఖ్యత లేని ఈ పాత్ర చివరకి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. మొత్తానికి ఎవరో ఒకరు దొరక్కపోరు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss