Sunday, June 20, 2021

Latest Posts

ఒక్క నెలలో 6 కిలోలు తగ్గిన పాయల్ ఎలా అంటే?

Payal Rajput Weight Loss

‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ పాల బుగ్గలతో మురిసిపోతూ, బొద్దుగా కుర్రాళ్ళ మనసును దోచేసింది. అయితే తాజాగా ఈమె బరువు తగ్గి సన్నజాజిలా మారిపోయింది. కేవలం ఒక్క నెలలోనే 6 కేజీల బరువు తగ్గి అందర్నీ షాక్ కి గురి చేసింది.

అయితే ఇలా తగ్గడానికి ఒక బలమైన కారణం ఉందట అదే తన రాబోయే సినిమా అట. అందుకోసం బరువు తగ్గినట్లు పేర్కొంది. సినిమాలో తనది పేదరికంలో కొట్టుమిట్టాడే అమ్మాయి పాత్ర అని, ఇందుకోసం బరువు తగ్గాల్సి వచ్చిందని ,అయితే పాత్ర కోసం ఇలా వెయిట్‌లాస్‌ అవ్వడం ఇదే తొలిసారి అని వివరణ ఇ‍చ్చింది. అంతేకాకుండా తాను ఎలా బరువు తగ్గిందో లైవ్ లో అభిమానులతో పంచుకుంది.

‘డైట్‌ చాలా కఠినంగా ఫాలో అయ్యాను. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 మధ్యలో  మాత్రమే ఆహారం తీసుకున్నా. దీంతో పాటు వారంలో కొన్ని రోజులు ఉపవాసం, యోగా, వ్యాయామాలు చేసేదాన్ని అలా కేవలం నెల రోజు వ్యవధిలోనే 6కిలోలు తగ్గాను’ అని పేర్కొంది.

ఇక తన లేటెస్ట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా మెరుపుతీగలా మారిపోయిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఓ క్యారెక్టర్‌ కోసం పాయల్‌ చూపించిన డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss