Thursday, December 2, 2021

Latest Posts

రాజ్యసభలో రచ్చ రచ్చ చేసిన విపక్షాలు

Pegasus stalls Parliament again

రాజ్యసభలో ఇవాళ కూడా పెగాసస్ పై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి. బల్లలు ఎక్కి, పెద్దగా అరుస్తూ చప్పట్లు చరుస్తూ విపక్ష నేతలు హంగామా సృష్టించారు. దాంతో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం ఏర్పడింది. సభలో పెగాసస్ పై చర్చకు ఈ రోజు విపక్షాలు మరింత పట్టుబట్టారు. ఛైర్మన్ పోడియం చుట్టూ చేరి పేపర్లు విసిరి కొట్టగా కొందరు చప్పట్లు కొడుతూ నిరసనలు తెలిపారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్ ఎంపీ రూల్ బుక్ ను ఛైర్మన్ పైకి విసిరేశారు. చెప్పాలంటే రాజ్యసభలో ఇవాళ విపక్షాలు వీరంగం సృష్టించారు.

సభ ప్రారంభమైన కొద్దిసేపట్టి నుండి ఇలానే తమ నిరసనలను తెలిపారు. విపక్షాలు ఎంతకూ దారికి రాకపోవడంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు. రాజ్యసభ పరిణామాలపై కేంద్రం స్పందిస్తూ దేశం, సమాజం, ప్రపంచం చూస్తుందన్న స్పృహేనా లేకుండా చట్టాలను రూపొందించే సభలో హుందాగా మెలగాల్సిన సభ్యులు వీధి రౌడీల్లా  ప్రవర్తించారంటూ మండి పడింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss