Thursday, December 2, 2021

Latest Posts

పింఛన్‌దారులకు శుభవార్త చెప్పిన జగన్

Pensioners DA Hike

పింఛన్‌దారులకు ఏపీ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేసే విధంగా ఉత్తర్వులలో పేర్కొన్నారు.  దీంతో పెన్షనర్ల కరువు భత్యం 33.536 శాతానికి పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిసి ఫించన్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నెల నుంచి చెల్లించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇక 2018 జూలై 1న 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంపుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంచింది. ఈ పెంపు అనంతరం పింఛనుదారుల డీఏ 38.776 శాతానికి పెరిగింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss