Sunday, January 17, 2021

Latest Posts

ఏలియన్ వీడియోలు బయటపెట్టిన పెంటగాన్

Pentagon releases Unidentifying Flying Object Video

యేలియన్స్ భూమి మీద ఉన్నాయా? వాటి గురించి చాలా కాలం నుంచి అమెరికా రహస్యంగా ఒక రహస్య ప్రదేశంలో పరిశోధనలు చేస్తుందా?… ఈ ప్రశ్నలకు మనకు సమాదానం అమెరికా మాత్రమే చెప్పగలదు. కానీ మన ప్రశ్నలకు సమాదాన్నిచ్చే కొన్ని వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతూ ట్రెండింగ్లో ఉన్నాయి. అమెరికా యొక్క యూ‌ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ (U.S. Department of Defense System) గుర్తు తెలియని విదంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఎగురుతున్న 3 వీడియోలను తానే అధికారికంగా రిలీస్ చేసింది. అవి ఏమిటి అనేది తెలియదని స్పష్టం చేసింది.

కాగా ఈ వీడియొలను 2004 – 2005 మధ్య తమ వైమానిక పైలట్స్ ఈ ఆబ్జెక్ట్ లను కనుగొని వాటిని కామెరాలతో చిత్రీకరించారని స్పష్టం చేసింది. ఈ వీడియొలలో ఉన్న ఆబ్జెక్ట్ ను ఇప్పటివరకు ఏమిటనే స్పష్టత లేదని మరో సారి స్పష్టం చేసింది.  వీటిని వైమానిక విమానాలో ఉండే ఇన్ఫ్రారేడ్  కామెరాల సహాయంతో చిత్రీకరించనట్టు తెలియచేసారు. కాగా వీడియొలో వినిస్పిస్తున్న పైలట్ మాటల్లో అది చూడడానికి డ్రోన్ వలె ఉందని తెలుస్తుంది. కాగా ఈ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో పాపులర్ అవుతున్నాయి.  చాలా మండి ఈ వీడియోలు చూసి యెలియన్స్ భూమి మీద ఉన్నాయని నమ్ముతున్నారు. కాగా కొంత మంది ఈ వీడియొలలో ఉన్నది యెలియన్ అని నమ్మటం లేదు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss