Monday, January 18, 2021

Latest Posts

మీ ఇంట్లో పెట్ డాగ్స్ ఫ్రీగా పెంచుకుంటున్నారా ఇక అంతే!

Pet Dogs And Animals

ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుక్కలు, పందులకు లైసెన్స్ లు ఉండాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 ఫైన్ తోపాటు రోజుకు రూ.250లు రుసుము వసూలు చేయాలని జీవోలో పేర్కొన్నారు.

ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా తిరిగి లైసెన్స్ పొందాలని ఆదేశాల్లో వెల్లడించారు. లైసెన్స్ లు పొందే ముందు ఆ కుక్కలు, పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలంటూ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ అందించడం, పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ టోకెన్ లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పంచాతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జిఓ ఎంఎస్ 693 లో ఆదేశాలిచ్చారు.

ఇవి కూడా చూడండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss