Monday, January 18, 2021

Latest Posts

అమితాబ్ అందుకు అనర్హుడు కోర్టులో పిటీషన్

Petition On Amitabh Bachchan

బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ పై కోర్టులో పిటీషన్ దాఖలయింది. అద్భుతమైన నటనకు తోడు, ఆయన వాయిస్ కి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ‘దో బూంద్‌ జిందగీ కే లియే’ అనే పోలీయో వ్యాక్సిన్‌ యాడ్‌ నుంచి, ఈనాటికరోనా వైరస్‌కాలర్‌ ట్యూన్‌ వరకూ ఆయన వాయిస్‌ విన్నవారెవ్వరైనా  బిగ్‌బీకి ఫిదా అవ్వకు మానరు.

అయితే ఇపుడు అమితాబ్‌ గొంతే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. కరోనా కాలర్‌ట్యూన్‌ వాయిస్‌కు బిగ్‌బీ అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన ఓ సోషల్ యాక్టివిస్ట్ కోర్టులో పిటిషన్ వేశారు. అమితాబ్‌ గొంతును ఆ కాలర్‌ట్యూన్‌ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

కాలర్‌ ట్యూన్‌లో జాగ్రత్తలు  బోధిస్తున్న అమితాబ్‌  స్వయంగా కరోనా బారిన పడ్డారని, ఇక ఆయన ఎలా సలహా ఇస్తారని పిటిషనర్‌ వాదించారు. ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కదా అరోపించారు. అంతేకాదు రెమ్యూనరేషన్‌ తీసుకొని వాయిస్‌ చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎంతో మంది కరోనా యోధులతోపాటు, సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని  పేర్కొన్నారు.  అమితాబ్‌ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడని అతను పిటీషన్ దాఖలు చేశాడు

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss