Tuesday, April 13, 2021

Latest Posts

పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్ట స్థాయి

Petrol Price In Hyderabad

దేశవ్యాప్తంగా ఇంధన ధరల వడ్డన కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో శుక్రవారం (ఫిబ్రవరి, 5) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజాగా   ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలను లీటరుకు 26 నుంచి 30 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29 నుంచి 32 పైసలు పెరిగింది.

తాజా రికార్డు ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.86.95 కు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ.77.13గా ఉంది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) వరుసగా రెండవ రోజు రిటైల్ ధరలను పెంచడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్‌ ధరలు:
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.90.42, డీజిల్ రూ. 84.14
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్  రూ. 93.09, డీజిల్ రూ. 86.31
బెంగళూరులో పెట్రోల్ రూ.89.85 డీజిల్ రూ.81.76
ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99
చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.82.33
కోలకతాలో పెట్రోల్ రూ.88.30 డీజిల్ రూ.80.71

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss