Tuesday, April 13, 2021

Latest Posts

100 ని తాకిన పెట్రోల్ ధరలు

Petrol Rates In India

పెట్రోల్ డీజల్ ధరలు వింటేనే సామాన్యుడి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.  దేశంలో రోజురోజుకి పెట్రోల్ డీజల్ ధరలు పెరుగుతూ పెరుగుతూ .. భారత చరిత్రలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 100 కి చేరుకుంది. నేడు రాజస్థాన్ లో బ్రాండెడ్ పెట్రోల్ ధర వంద మార్కుని చేరుకుంది. నేడు చమురు సంస్థలు పెట్రోలు ధరను 25 పైసల మేరకు పెంచడంతో ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది.

దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ రేటు లీటరుకు రూ.76.23 కు ముంబైలో లీటరుకు రూ .83.03 కు చేరుకుంది. ఇక పోతే శ్రీగంగానగర్ లో రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు 98.40 రూపాయలు. ప్రీమియం లేదా బ్రాండెడ్ పెట్రోల్ లీటరుకు 101.15 రూపాయలు. ఢిల్లీలో బ్రాండెడ్ పెట్రోల్ లీటరుకు రూ .89.10 ముంబైలో రూ .95.61 గా వుంది. దేశంలో భారీగా చుమురు ధరలు పెరగడంతో వీటి పై వేస్తున్న ట్యాక్సులను ప్రభుత్వాలు తగ్గించాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss