ఏపీలోని ఎన్నికలకు ముందు అంతా ప్రముఖ రాజకీయ వేత్త మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి వరకు తాను గమనించిన ఎన్నికలపై సమగ్ర విశ్లేషణలు,లోపాలను పలుమార్లు ఎత్తి చూపించారు.అలాగే ఉండవల్లికి జగన్ అంటే ఎంత ప్రీతీ ఉందో వారై కుటుంబానికి ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికి తెలుసు.అయితే ఉండవల్లి ఇన్నాళ్ల తర్వాత ఎట్టకేలకు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు.
రావడంతోనే ఉండవల్లి జగన్ పాలనపై కొన్ని కీలక మరియు షాకింగ్ కామెంట్స్ చేసారు.మొదటగా ప్రవేశ పెట్టిన నవరత్నాలను ప్రజలకు చేరవేయడంలో జగన్ విజయం సాధించారని అలాగే అనేక అంశాల్లో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా హర్షించారు.కానీ అలా చెప్తూనే జగన్ కు చిన్నగా వార్నింగ్ కూడా ఇచ్చారు.
జగన్ కు 151 సీట్లు వచ్చి తెలుగుదేశం పార్టీకు నామమాత్రంగా 23 స్థానాలే వచ్చాయని శాశ్వతం అనుకోకూడదని వైసీపీ గెలిచింది 51 శాతంతోనే అని గతంలో మొట్టమొదటిసారిగా 1978లో పీవీ నరసింహారావు గారని కానీ ఆ ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల్లోనే కుప్పకూలిపోయిందని మళ్ళీ అలాగే 1994లో స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం మరియు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చెయ్యగా 55 శాతం ఓట్లు వచ్చాయని కానీ వారి ప్రభుత్వం కూడా మళ్ళీ తొమ్మిది నెలల్లోనే దిగిపోయిందని అందుకని జగన్ ప్రభుత్వానికి తాను హెచ్చరిస్తున్నానని ఇవాళ వారికేదో ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చింది అన్నది శాశ్వతం కాదని తెలిపారు.జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని జగన్ పాలన ఏపీలోని ప్రజలు ప్రతీ ఒక్కరికి నచ్చే విధంగా ఉండాలని సూచించారు.