Wednesday, June 23, 2021

Latest Posts

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం 100 మందికి పైగా మృతి

పాకిస్తాన్‌ కరాచీ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లాహోర్‌ నుంచి కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ‌ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌లైన్స్ (పీఐఏ- ఏ320)‌కు చెందిన విమానం కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో  కూలినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయని,  ప్రజలు నివశిస్తున్న ప్రదేశంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండచ్చని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ఆ దేశ ఆర్మీ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగ్రాతులను సమీపంలో జిన్నా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ‍ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్‌ మీడియా సంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss