Saturday, May 15, 2021

Latest Posts

భద్రతా దళాలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ

ఉగ్రవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి పన్నిన కుతంత్రాన్ని మరోసారి విఫలం చేసినందుకు భద్రతా దళాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని నగ్రోటాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన నేపథ్యంలో మోదీ ట్విటర్ వేదికగా భద్రతా దళాలను అభినందించారు మోదీ. శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ”పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వారి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉండటం సూచిస్తున్నది ఏమిటంటే, పెద్ద ఉపద్రవం, విధ్వంసాలను సృష్టించేందుకు వారు చేసిన ప్రయత్నాలను మరొకసారి అడ్డుకున్నట్లు వెల్లడవుతోంది” అని పేర్కొన్నారు. ”మన భద్రతా దళాలు మరొకసారి అత్యున్నత స్థాయి ధైర్యసాహసాలు, వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించాయి. వారి అప్రమత్తతకు ధన్యవాదాలు, జమ్మూ-కశ్మీరులోని క్షేత్ర స్థాయి ప్రజాస్వామిక ప్రక్రియలను లక్ష్యంగా చేసుకునేందుకు జరిగిన దుష్ట పన్నాగాలను వారు ఓడించారు” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss