Monday, May 10, 2021

Latest Posts

మూడోసారి ప్రధానిగా కూడా మోదీయే!

ఇప్పటికే రెండో దఫా ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని అవుతారట. అవును ఇండియా జరిపిన సర్వేలో ప్రజాభిప్రాయం ఇలాగే ఉందట. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పోలిస్తే తదుపరి ప్రధానిగా నరేంద్ర మోదీవైపే అత్యధికులు మొగ్గుచూపినట్టు ఇండియా టుడే గ్రూప్‌-కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (ఎంఓటీఎన్‌) సర్వేలో వెల్లడైంది. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌ను ఇండియా టుడే గ్రూప్‌- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీల్లో ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారనేదానిపై ప్రజామోదంలో ఇద్దరికి 40 శాతం వ్యత్యాసం వచ్చిందట.తదుపరి ప్రధానిగా 53 శాతం మంది నరేంద్ర మోదీని సూచించగా దేశాన్ని ముందుకు నడపడంలో రాహుల్‌ గాంధీయే సరైన నాయకుడని కేవలం 13 శాతం మంది మాత్రమే చెప్పుకొచ్చారట. ఇక కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తదుపరి ప్రధానిగా ఉండాలని 7 శాతం మంది అభిప్రాయపడ్డారు.హోంమంత్రి అమిత్‌ షా దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టాలని కేవలం 4 శాతం మంది ఆకాంక్షించారు.

నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యామ్నాయం ప్రియాంక గాంధీయేనని 3 శాతం మంది ఆమె వైపు మొగ్గుచూపారు. వర్గాల వారీగా చూస్తే, 60 శాతం మంది హిందువులు, 17 శాతం మంది ముస్లింలు నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని చెప్పారట. రాహుల్‌ గాంధీ నాయకత్వానికి 10 శాతం హిందువులు, 32 శాతం మంది ముస్లింలు జైకొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ భారతంలో 66 శాతం మంది అక్కున చేర్చుకోగా, రాహుల్‌ వైపు కేవలం ఆరు శాతం మందే మొగ్గుచూపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss