Tuesday, January 25, 2022

Latest Posts

మరొక మైలు రాయి సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi Reach 70 Million Mark In Twitter

గురువారం, ప్రధాని నరేంద్ర మోడీ మరొక మైలు రాయిని చేరుకున్నారు. ప్రస్తుతం ఉన్న రాజీకీయ నాయకుల్లో ట్విట్టర్ లో మోస్ట్ పాపులర్ నాయకునిగా మోడి నిలిచారు. తన ట్విట్టర్ హ్యాండిల్ 70 మిలియన్ల మంది ఫాలివోర్లను సాధించి మొదటి స్థానానికి చేరుకున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యిన తరువాత మోడీ 2009లో ట్విట్టర్ ఉపయోగించడం ప్రారంభించారు. అతను 2010 నాటికి లక్ష మంది అనుచరులను సంపాదించుకున్నారు. ఆ తరువాత భారతీయ ప్రధానమంత్రిగా మారిన తరువాత అతని అనుచరుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక సంవత్సరం క్రితం, జూలై 2020లో, మోడీ ట్విట్టర్ అనుచరుల సంఖ్య 60 మిలియన్ల మార్కును దాటింది.

తదుపరి అత్యధికంగా 53 మిలియన్ల మంది అనుచరులతో పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో 26.3 మిలియన్ల మంది ఉండగా, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss