Home రాజకీయం ఇక నుండి స్థానిక వస్తువులకు ప్రాధాన్యం

ఇక నుండి స్థానిక వస్తువులకు ప్రాధాన్యం

PM Modi Speaks On Purchasing Local Goods

మంగళవారం జాతినుద్దేశించి మాట్లాడినా ప్రధాని మోడీ ఇక నుంచి స్థానిక వస్తువుల ఉత్పత్తికి, సప్లైకి ప్రయారిటీ ఇస్తామని తెలిపారు. ఖాదీ, హ్యాండ్లూమ్‌కు డిమాండ్ లేదని వాటికి మంచిగా  మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌కు ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవస్థ, డెమోగ్రపీ అనే నాలుగు పిల్లర్లు, ఐదో పిల్లర్ గా డిమాండ్ అని మోడీ పేర్కొన్నారు. దేశంలో డిమాండ్, సప్లై ఉంటుందని  వాటిని అందరూ ఉపయాగించు కోవాలని సూచించారు.

ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీకి బలం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా  తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్  పేరుతో ప్రకటించిన ఆర్దిక ప్యాకేజీ లో  సూక్ష్మ, మధ్యతరగతి వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని, స్వయం సమృద్ది, ఆర్థిక నిర్మాణం కోసమే ఈ ప్యాకేజీ ప్రకటించి నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన మోదీ

Exit mobile version