Thursday, December 2, 2021

Latest Posts

దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం – ప్రధాని పిలుపు

PM Modi’s Independence Day speech

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుదేసించి ప్రధాని మాట్లాడుతు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విభజన సమయంలో ఎన్నో బాధలు పడినవారిని, ఆ సమయంలో అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయిన వారిని ఆగస్టు 14న స్మరించుకుందాం, ఇప్పటి నుంచి 100వ స్వాతంత్ర్య వేడుకల సమయానికి భారత్ ప్రబల శక్తిగా ఎదిగేలా సంకల్పం తీసుకోవాలని ప్రధాని అని పిలుపు నిచ్చారు.  ఈ 25 ఏళ్ల అమృత ఘడియల్లో భారత నిర్మాణమే కాదు, అందులో సౌకర్యాల విషయంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా ఉండకుండా దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం అన్నారు.

కాగా కరోనా గురించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వ్యాక్సీన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ మందికి వ్యాపించింది. మనం ఎన్నో ప్రాణాలను కాపాడుకున్నాము. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్నప్పుడు భారత్ కరోనా వ్యాక్సీన్ తయారు చేసి ప్రజలకు అందించే పని చేసింది. కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టడం వల్ల భారత ప్రజలకు ఉచితంగా రేషన్ అందించామని తెలిపారు ప్రధాని.

అలాగే వ్యవసాయ రంగంలో ఇంకా నూతన సంస్కరణలు తీసుకు రావాలని ఈ సందర్భంగా తెలిపారు ప్రధాని. చిన్న రైతులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ పథకాలను మార్చుకోవాలన్నారు. కిసాన్‌ బీమా, ఫసల్‌ బీమా, రైతులకు సమర్థంగా అందరికి అందేలా చూడాలన్నారు. చిన్న, సన్నకారు రైతులు దేశానికే గర్వకారణమయ్యేలా పథకాలుండాలన్నారు. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలని ప్రధాని  పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:   

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss