Wednesday, April 21, 2021

Latest Posts

ఆంఫన్ తుఫాను నుండి అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా – మోదీ

ప్రదని మోదీ ఆంఫన్ తుఫానుపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ  ‘‘ఆంఫన్ తుఫానుకు పరిస్థితికి సంబంధించిన సంసిద్ధతపై చర్చించాం. ప్రతిస్పందన చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియల గురించి చర్చించాం. అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు.  ఆంఫన్ తుఫాను నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని ముఖ్య సలహాదారు సిన్హా, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులు హాజరయ్యారు.  ఆ సమీక్ష సమావేశం అనంతరం మోడీ ఈ విధంగా తన స్పందనను తెలిపారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss