కరోనా కట్టడిలో భాగంగా మూడో సారి విదించిన లాక్ డౌన్ ను కొనసాగించేందుకు అన్నీ రాష్ట్రాల ముఖ్య మంత్రుల అభిప్రాయాలు తెలుసుకొనున్న మోడి. కాగా 3 వ సారి విదించిన లాక్ డౌన్ మరో ఆరు రోజుల్లో ముగియనుంది. ఈ రోజు మద్యాహ్నం 3 గంటలకు మొదలుకానున్న ఈ వీడియొ కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా కొనసాగనుంది. మొదటి సెషన్ 3 నుంచి 5 గంటల వరకు కాగా ఒక గంట విరామం తర్వాత రెండవ దఫా కాన్ఫరెన్స్ మొదలుకానుంది.
3 వ సారి లాక్ డౌన్ పొడిగించినప్పటికి కొన్ని నిబందనలను సడలించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో పాటు పరిశ్రమల విశ్యాలలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో తీసుకునే నిర్ణయం ఏంటి అనేది ఆసక్తి గా మారింది. వలస కారిమికులు వారి వారి రాష్ట్రాలకు చేరుకుంటున్న ఈ సమయంలో కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉంది. కాగా గ్రీన్ జోన్, రెడ్ జోన్ ల సడలింపులులపై కొన్ని రాష్ట్రాలు అభయంతరం వ్యక్త పరుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: అమిత్ షా పేరుతో నకిలీ ట్వీట్స్.. నలుగురి అరెస్ట్..