Wednesday, December 1, 2021

Latest Posts

నీరజ్ చోప్రాకు అభినందనల వెల్లువ

PM Narendra Modi wishes for Neeraj Chopra

టోక్యో ఒలంపిక్స్లో జావెలిన్ త్రో లో అసమాన ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డుకు ఎక్కాడు.  బంగారు పతకం సాధించడంతో దేశప్రజలు మరియు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.

ఇది అసాధారణ విజయమని, చోప్రా సాధించిన జావెలిన్ గోల్డ్ అన్ని హద్దులను చెరిపేసి, చరిత్ర సృష్టించిందని, దేశం గర్విస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు.  నీరజ్ చోప్రా సాధించిన ఘనతను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.  మోదీ ట్విట్టర్ ద్వారా నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.  “టోక్యోలో చరిత్ర సృష్టించారు. నీరజ్ చోప్రా సాధించిన విజయం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. నీరజ్ ఎంతో పట్టుదలగా, అనితర సాధ్యమైన ప్రతిభ చూపారు. బంగారు పతకం గెలుచుకున్న నీరజ్‌కు నా అభినందనలు” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss