Thursday, May 13, 2021

Latest Posts

ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చెయ్యాలి – మన్‌ కీ బాత్‌లో మోదీ

PM Narendra Modi’s in Mann Ki Baat with Nation

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌పంచ దేశాలు ఉమ్మ‌డి పోరాటం చేస్తున్నాయి. ఈ పోరులో భార‌త్ సైతం ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తుంది.  ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా మన్‌ కీ బాత్‌లో పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు నెలరోజుల పాటు చేసే ఉపవాసల అనంతరం ఈద్ వస్తుంది. ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చేసి రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.

అదే సమయంలో బహిరంగ స్థలాల్లో ఉమ్మివేయడమనే చెడ్డ అలవాటును శాశ్వతంగా మానుకోవాలని మోదీ సూచించారు. పరిసరాల శుభ్రతతోపాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ స్థలాల్లో ఉమ్మివేసే అలవాట్లు మానుకోవాలని ప్రధాని సూచించారు. ప్ర‌జ‌ల్లో వైర‌స్ పై ఉన్న అపోహ‌లు, అనుమానాలు వ‌దిలిపోయేలా స్పూర్తిని నింపుతు, మందులేని మ‌హ‌మ్మారిని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర .

ఈ సంద‌ర్భంగా మోదీ చేసిన ప్ర‌సంగంలో కరోనాపై పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ప్ర‌మాద‌కారి అయిన కోవిడ్ వైర‌స్‌తో మన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss