Saturday, January 16, 2021

Latest Posts

పోకిరి మూవీకి  మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీయే స్ఫూర్తా

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అనే డైలాగ్ అప్పట్లో యూత్ లో రివీల్ అయిన  డైలాగ్. అందుకే ఆ సినిమా అంతగా బ్లాక్ బస్టర్ అయింది.  పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు,ఇలియానా జంటగా నటించిన   పోకిరి మూవీ పాటలు,స్క్రీన్ ప్లే అన్నీ సూపర్.  అండర్ కవర్ పోలీసాఫీసర్ గామహేష్ బాబు ఎక్కడా బయటపడకుండా చాలా సస్పెన్స్ మెయింటేన్ చేయడంతో డైరెక్టర్ పనితనం తెల్సింది. చివరిలో  అతడు పోలీసాఫీసర్ అని తెలియడం వరకూ సినిమా ఏంటన్నది ఎవరికీ అర్ధం కాదు. అంతలా సస్పెన్స్ నడిపించాడు.

అంతాబానే ఉందిగానీ, తెలుగులో ఏ సినిమా తీసినా దానికి మూల కథ అంటూ ఒకటి ఉంటుందని అంటారు. బాలీవుడు,హాలీవుడ్ లలో వచ్చిన సినిమాల్లో చిన్న స్టోరీ లైన్ తీసుకుని మనకు తగ్గట్టు అల్లేస్తారని టాక్. అయితే మనం అనుకున్నట్టు పోకిరీకి  హాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ కాదు, మన టాలీవుడ్ సినిమానే ఉందని కొందరు విశ్లేషకుల అంచనా.  బాగా గమనిస్తే, తెలుగులో మెగాస్టార్ మూవీ ఒకటి గుర్తొస్తుందని అంటారు.   టి సుబ్బరామిరెడ్డి నిర్మాతగా  చిరంజీవి హీరోగా వచ్చిన స్టేట్ రౌడీ మూవీ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. బప్పీలహరి సంగీతంతో పాటలు అదిరాయి. భానుప్రియ, రాధ హీరోయిన్స్ గా చేశారు.

ఈ మూవీలో రావు గోపాలరావు, నూతన ప్రసాద్,త్యాగరాజూ  విలన్లు. అయితే కాళీచరణ్ అనే రౌడీ ఊళ్ళల్లో ఉండే మిగిలిన గుండా బాచ్ లను భయపెడుతూ అందరినీ దారికి తెచ్చుకుంటాడు. అయితే అతగాడిని   తమవైపు తిప్పుకోవాలని రావుగోపాలరావు,నూతన ప్రసాద్ లు ట్రై చేస్తారు.  తర్వాత అతడు కాళీ అసలు పేరు పృద్వి అని  అతోడొక పోలీసాఫీసర్ అని తెలుస్తుంది. శారద భర్త  జగ్గయ్య హత్య తర్వాత పృద్విని ఆమె   ఆఫీసర్ గా   నియమించినట్లు తెలుస్తుంది.  ఇక పోకిరి ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు తీశారు. కానీ స్టేట్ రౌడీ అప్పటి ట్రెండ్ కి తగ్గట్టు తీశారు. ఇంచుమించు రెండూ పరిశీలిస్తే ఒకేలా ఉంటాయని అంటున్నారు.మరి అవునో కాదో మీరో సరిపోల్చుకోండి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss