Wednesday, April 21, 2021

Latest Posts

విశాఖ సంఘటనలో పోలీసులు, యువత సహకారం అభినందనీయం

విశాఖ సంఘటనలో పోలీసులు, అగ్నిమాపక, ఇతర శాఖలకు కూడా సమాచారం అందడంతో ఆయా విభాగాల అధికారులు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌), కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం (సీఐఎస్‌ఎఫ్‌) సభ్యులు రంగంలోకి దిగారు. రహదారులపైనా, ఇళ్లలోనూ అచేతనంగా పడి ఉన్న సుమారు 350 మందిని అంబులెన్సుల్లో కేజీహెచ్‌, సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు, పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.

పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టే సమయానికి పలువురు ఇళ్లలోనే ఉండి కనీసం ఇంటి తలుపు కూడా తీయలేని నిస్సహాయ స్థితిలో, నిస్సత్తువతో కొట్టుమిట్టాడారు. తెల్లవారుజాము కావడంతో మరుగుదొడ్లకు వెళ్లినవారు అక్కడే కుప్పకూలిపోయారు. ఇలాంటివారందర్నీ తలుపులు బద్దలుకొట్టి ఆసుపత్రులకు తరలించారు. ఆక్సిజన్‌ అందించి తక్షణ చికిత్స చేయడంతో స్పహ కోల్పోయిన వారిలో చాలామంది ప్రాణాలు నిలబడ్డాయి. కాగా ఈ పరిస్తితులలో అక్కడి పోలీసులు, యువత సహకారం అభినందనీయం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss