Sunday, June 20, 2021

Latest Posts

పూజా హెగ్డే పారితోషకం అమాంతం పెంచేసింది

Pooja Hegde Movie Remuneration Increased

బుట్ట బొమ్మ పూజా హెగ్డే దక్షిణాదిలో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు ఈమె రణవీర్ సింగ్ మరియు రోహిత్ శెట్టిల సర్కస్ విడుదల కోసం ఎదురుచూస్తుంది. అలానే ఈ హీరోయిన్ సౌత్ తో పాటు, హిందీ పై కూడా దృష్టి సారించింది. ఆమె హిందీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి కబీ ఈద్ కబీ దీపావళిలో కూడా నటిస్తుంది.

దీనితో ఇప్పుడు, ఈ హీరోయిన్ తన పారితోషికాన్ని పెంచిందని సమాచారం. ఆమె ఇటీవల సంతకం చేసిన తమిళ చిత్రం తలపతి 65 కోసం రూ .3 కోట్లు అడిగిందని అందుకోసం దర్శక నిర్మాతలు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇది దక్షిణాది హీరోయిన్ల లోనే అత్యధిక పారితోషికం. నయనతార మాత్రమే ఒక్కో చిత్రానికి రూ .3 కోట్లు వసూలు చేసేవారు. సమంతా కూడా రూ .3 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు పూజా రూ .3 కోట్ల ఎలైట్ హీరోయిన్ క్లబ్‌లో చేరింది.

ప్రస్తుతం ఆమె పెద్ద బడ్జెట్ చిత్రాలతో చాలా బిజీగా ఉండటంతో మరియు అధిక డిమాండ్ ఉండడంతో పూజా తన వేతనం పెంచింది. తాజాగా ఆమె ప్రభాస్ ’రాధే శ్యామ్’ లో కూడా హీరోయిన్ గా నటించింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss