Pooja Hegde New House
పూజా హెగ్డే ఇటు టాలీవుడ్ తో పాటు, అటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సాధించుకున్న నటి. ఒకేసారి తెలుగు మరియు హిందీ తెరలలో కెరీర్ చేస్తున్న అరుదైన కథానాయికలలో ఆమె ఒకరు. అలా వైకుంఠపురం లో నుండి వచ్చిన సూపర్ హిట్ పాట బుట్ట బొమ్మతో ఆమె అందరి మనసులను దోచుకుంది.
ప్రస్తుతం ఆమె ఈ చిత్రాలతో చాలా బిజీగా ఉంది – ప్రభాస్‌తో “రాధే శ్యామ్”, అఖిల్ అక్కినేనితో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, సల్మాన్ ఖాన్‌తో “కబీ ఈద్ కబీ దివాళి”, రణవీర్ సింగ్‌తో “సర్కస్” ఇంకా “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ కు జతగా నటిస్తుంది.
ఆమె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే రేంజ్ లో సినిమాలు చేస్తూ బోలెడు సంపాదిస్తుంది. ఇటీవల ఆమె ముంబైలో ఖరీదైన 3 బిహెచ్కె ఫ్లాట్‌ను కొన్నట్టు సమాచారం. దాని ధర ఎంత అనేది ఇంకా తెలియదు కాని చాలా మంది బాలీవుడ్ నటీమణులకు ఇది డ్రీమ్ హోమ్ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ హౌస్ తన పేరెంట్స్ కి దగ్గరగా ఉంటుందని అక్కడ కొన్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి: