Sunday, June 20, 2021

Latest Posts

కరోనా బారిన పడ్డ బుట్ట బొమ్మ

Pooja Hegde Tests Positive For COVID -19

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ పూజా హెగ్డే క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె స్వయంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. కోవిడ్ బారిన ప‌డిన త‌ను హోం క్వారంటైన్ లోకి వెళ్లానని తెలిపింది. అలానే త‌న‌ను ఈ మధ్య క‌లిసిన‌ వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలని సూచించింది ఈ బుట్ట బొమ్మ.

ఇకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌ను ఫాలో చేస్తున్న‌వారి సంఖ్య‌ కోటీ 30 ల‌క్ష‌లు దాట‌డంతో, ఎల్ల‌ప్పుడూ త‌న వెంటే ఉంటూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది పూజా హెగ్డే. అయితే ఇలా చెప్పిన కొద్ది సేపటికే తనకు కోవిడ్ సోకిందంటూ బాధాక‌ర‌మైన వార్త‌ను షేర్ చేసింది.

ఇక సినిమా విషయాలకి వస్తే పూజా హెగ్డే ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, చిరంజీవి ఆచార్య చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే త‌మిళ ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలోనూ హీరోయిన్‌గాను నటించనుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss