Sunday, June 20, 2021

Latest Posts

అల్లు అర్జున్ కి కరోనా రావడం పై రియాక్ట్ అయిన బుట్ట బొమ్మ

Pooja Hegde Tweet To Allu Arjun

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్ కుదిపేస్తుంది. చిన్న నటుల నుంచి పెద్ద హీరోల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు ఈ కరోనా. తాజాగా ఈ జాబితాలో చేరిన హీరో స్టైలిష్ హీరో అల్లు అర్జున్. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను హోం క్వారంటైన్ కి వెళుతునట్టు చెప్పాడు.

అయితే అల్లు అర్జున్ కి కరోనా రావడం పై స్పందించింది బుట్ట బొమ్మ. అలా వైకుంటపురంలో  అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే కి ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ పోస్ట్‌కి సమాధానమిస్తూ పూజా హెగ్డే, “బంటు అముల్య కంపెనీకి ఇస్తున్నట్లుంది! జాగ్రత్త వహించండి త్వరలోనే కోలుకుంటారు” అంటూ సినిమా భాషలో వ్రాసింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ బంటు గా, పూజా అమూల్య గా నటించింది. కొన్ని రోజుల క్రితం, పూజా హెగ్డే కి కూడా కరోనావైరస్ సోకింది. అందుకే నాకు కంపెనీ వచ్చావు అంటూ ఆమె తెలిపింది. ఇక అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్ప చేస్తుండగా, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు రాధే శ్యామ్‌లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss