Monday, May 10, 2021

Latest Posts

పాపులర్ తమిళ కమెడియన్ వివేక్ కి గుండెపోటు

Popular Comedian Vivek Got Cardiac Arrest

పాపులర్ తమిళ కమెడియన్ వివేక్(59) తీవ్ర అనారోగ్యంతో ఐ‌సి‌యూలో చేరారు. ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆసుపత్రిలో చేరిన వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ యాజమాన్యం చెబుతుంది. అయితే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌కి గుండె పోటుకి గురి కావడం కలకలం రేపింది. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

కాగా చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ఆయన ట్వీట్‌ కూడా చేశారు. అయితే, ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయనకు ఏమీ కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss