Thursday, December 2, 2021

Latest Posts

బెల్జియన్ ఆర్టిస్ట్‌ వినూత్న మాస్క్

Portable oasis a breath of fresh air for Belgian artist

బెల్జియన్‌ దేశానికి చెందిన కళాకారుడు అలైన్ వెర్ష్యూరెన్ అనీ వినూత్నమైన బాక్స్ మాస్క్ ను రూపొందించాడు. 61 ఏండ్ల బెల్జియన్ కళాకారుడు, సామాజిక కార్యకర్త అయిన అలైన్‌ ఔషధ మొక్కలతో కలిగి ఉన్న ఒక బాక్స్ ను హెల్మెట్‌ లాగా తలకు ధరించి దానికి ‘పోర్టబుల్ ఒయాసిస్’ అని పేరు పెట్టారు. కరోనా వల్ల అందరు మాస్క్ తప్పని సరి అయ్యింది. మాస్క్ పెట్టుకోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న  కొంతమందికి ఉపరి తీసుకోవడంలో చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా ఇబ్బంది పడటంతో ఈ కొత్త రకం బాక్స్ మాస్క్ ను రూపొందించి నట్లు చెప్పారు అలైన్‌. తనకు ఆస్థమా ఉండటంవల్ల మాస్క్ తో చాల ఇబ్బంది పడ్డట్లు అయన తెలిపారు.

15 సంవత్సరాల కిందటే ఈ ఆలోచన వచ్చినట్లు తెలిపారు. గతంలో పనిచేసిన ట్యునీషియాలోని పచ్చని ఒయాసిస్‌ల నుండి ప్రేరణ పొంది కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తన ఆలోచనను తిరిగి ఈ విధంగా అమలు చేస్తున్నాట్లు తెలిపారు. ‘ఎడారిలో ప్రశాంతత, చల్లదనం, శ్రేయస్సు నిచ్చే ప్రదేశం ఒయాసిస్. అందుకే ఔషధ మొక్కలున్న ఈ బాక్స్ మాస్క్ కు ఒయాసిస్‌ అని పేరు పెట్టాను. ఈ పోర్టబుల్ ఒయాసిస్ నుండి బయట గాలిలో ఉండే హాని నుండి నన్ను నేను రక్షించుకుంటున్నాను, నేను  ధ్వని మరియు దుర్వాసనతో కుడి ఉన్న ప్రపంచం నుండి దూరంగా ఉంటున్నాను, నన్ను లాక్ చేయగల బబుల్‌ను సృష్టించాను’ అని అలైన్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss