Saturday, January 16, 2021

Latest Posts

పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అని ఆ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా

Power Star Pawan Kalyan Title

‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా తో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఏకంగా పవర్ స్టార్ అయ్యాడు.

అతి తక్కువ కాలంలో పవర్ స్టార్ అవ్వడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. అయితే ఇండస్ట్రీలో లోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పేరు.. కళ్యాణ్ కుమార్ గా ఉండేది. హీరోగా రాకముందు కూడా తన చిన్న అన్నయ్య నాగబాబు, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా ఉన్నాడు.

అయితే హీరోగా పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసాడు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఇక ఆ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. అయితే పేరు కూడా పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్‌ను పవన్ స్టార్ అని సంభోదించడంతో ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు చేర్చడం స్టార్ట్ చేశాయి.

ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాన్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ వేసారు. ఇలా పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పేరు పెట్టడం వెనక పోసాని కృష్ణమురళి హస్తం ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కృష్ణ మురళి కూడా ప్రస్తావించారు. అయితే బిరుదుకి తగ్గట్టుగా తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా తన సత్తా చాటుతూనే, మాఓప్రక్క జనసేనా పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss