Tuesday, January 25, 2022

Latest Posts

ప్రభాస్ పుట్టిన రోజు అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ లు

Prabhas Birthday Surprise To Fans

అక్టోబర్ 23న ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నాడు. అయితే ఈ పుట్టిన రోజు నాడు ప్రభాస్ తన అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తన తదుపరి సినిమా అప్డేట్ మరియు ఫ్యూచర్ లో ఇంకా ఏం చేయనున్నాడు అనే విషయాలను వెల్లడించనున్నాడు. ఇంకా రాధే శ్యామ్ యొక్క నిర్మాతలు హీరో పుట్టినరోజున కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున చిత్రం విడుదల తేదీని ప్రకటించాలని యోచిస్తున్నారు.

ఇది కాకుండా, సాలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్ర టీజర్ / మేకింగ్ వీడియోను ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేయాలని ఎదురుచూస్తున్నాడు. అంతే కాకుండా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ యొక్క ఫస్ట్ లుక్ మరియు ప్రాజెక్ట్ -కె టైటిల్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇకపోతే, ప్రభాస్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ఇందులో ఒక రా ఏజెంట్‌గా కనిపిస్తాడు మరియు ఈ చిత్రం 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రీకరించబడుతోంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss