Sunday, June 20, 2021

Latest Posts

మిషన్ ఇంపాజిబుల్ 7లో డార్లింగ్ ప్రభాస్ నటించనున్నాడా

Prabhas In Mission Impossible 7

టామ్ క్రూజ్ యొక్క మిషన్ ఇంపాజిబుల్ 7లో బాహుబలి నటుడు ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడని ఒక బలమైన వార్త సంచలనం సృష్టిస్తుంది. టామ్ క్రూజ్ నటిస్తున్న చిత్రంలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడని దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ధృవీకరించారని సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ నడుస్తుంది.

అతను ఇటలీలో రాధే శ్యామ్ చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడు స్క్రిప్ట్‌ను నటుడికి వివరించాడట. కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఓకే చేశాడని టాక్. అయితే, దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను నిజంగా టామ్ క్రూజ్ యొక్క మిషన్ ఇంపాజిబుల్ 7 లో గనుక నటిస్తే ఇక ప్రభాస్ హాలీవుడ్ హీరో అయినట్టే అని చెప్పాలి.

ఇదిలావుండగా, పాన్-ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పెద్ద బడ్జెట్ చిత్రాలను చేస్తున్నారు. పూజా హెగ్డే, ప్రభాస్ కలిసి నటించిన రాధే శ్యామ్ జూలై 30 న విడుదల కానుంది. నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి ప్రభాస్ కనిపించనున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సాలార్ మరియు ఓం రౌత్ తో ఆదిపురుష్ లో నటిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss