Home సినిమా వార్తలు ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన డార్లింగ్ ప్రభాస్

ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన డార్లింగ్ ప్రభాస్

Prabhas Latest Photo At Hyderabad Airport Going Viral, Darling Prabhas, Prabhas Latest Photo, Hyderabad Airport, Prabhas Photo, Prabhas At Hyderabad Airport, Prabhas, 99Telugu

Prabhas Latest Photo At Hyderabad Airport
బాహుబలి సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. రెండు, మూడేళ్లు ఖాళీ లేకుండా రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ.. ఇలా బోలేడు సినిమాలకు సంతకం చేశాడు ప్రభాస్‌.

ఇక ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్‌ జూలై 3న విడుదల కోసం సిద్ధం చేశారు. అయితే  హీరోయిన్‌ పూజా హెగ్డేకు కరోనా సోకడంతో సినిమా వర్క్‌ ఆగిపోయింది. ఇక సలార్‌, ఆదిపురుష్‌ చిత్రీకరణ దశలో ఉండగా, నాగ్‌ అశ్విన్‌ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది.

ఇక ప్రభాస్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌కు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. హీరోతోపాటు రాధే శ్యామ్‌ చిత్ర బృందం కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే గత కొన్ని రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కాడు. ముఖానికి తెలుపు రంగు మాస్క్‌, షర్ట్‌, క్యాప్‌, కళ్లద్దాలతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

Exit mobile version