Monday, October 25, 2021

Latest Posts

ప్రభాస్ మరో కొత్త సినిమాకి సంతకం

Prabhas Next Film With Bang Bang Director

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమాకి సంతకం చేసినట్లు తెలుస్తుంది. వార్ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో జతకడుతున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ సినిమాలకు పేరు గాంచిన ఈ దర్శకుడు ప్రభాస్ తో ఒక యాక్షన్ డ్రామా ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకునేందుకు కత్రినా కైఫ్‌ను బోర్డులోకి తీసుకురావాలని సిద్ధార్థ్ ఆనంద్ యోచిస్తున్నట్లు సమాచారం. కత్రినా కైఫ్‌తో సిద్ధార్థ్ బ్యాంగ్ బ్యాంగ్‌ సినిమాలో కలిసి పనిచేశారు. అయితే ఆమె ఈ సినిమాకు ఒప్పుకుందా లేదా అనేది ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం సిద్ధార్థ్ పఠాన్ సినిమా కోసం దీపికా పదుకొనే మరియు షారుఖ్ ఖాన్ లతో కలిసి పనిచేస్తున్నారు. అలానే ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ మరియు సాలార్ షూటింగ్స్ ని పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రాలు పూర్తి అయిన తరువాత ఈ దర్శకుడితో కలిసి పని చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss