Tuesday, April 13, 2021

Latest Posts

ప్రభాస్ పారితోషకం ఈ భారీ ఫిగర్ ని రీచ్ అయ్యిందా

Prabhas Remuneration Is Increased
ఇప్పటి వరకు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మాత్రమే ఒక్కో చిత్రానికి సుమారు 100 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నారు. కానీ ఈ జాబితాలో కొత్తగా మరో కొత్త స్టార్ వచ్చి చేరాడు అది మరెవరో కాదు మన డార్లింగ్ ప్రభాస్.

ప్రభాస్ ఒక చిత్రానికి రూ .100 కోట్ల పారితోషకం వసూలు చేస్తున్నట్లు సమాచారం. అతనికి పాన్-ఇండియా లెవెల్లో అభిమానులు ఉండటంతో ఈ భారీ పారితోషకం ఇస్తున్నట్టు సమాచారం. సాహో బాలీవుడ్ లో కూడా విజయవంతం కావడంతో ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ విస్తృత మార్కెట్ను ఆస్వాదించే నిజమైన పాన్-ఇండియా సూపర్ స్టార్ అని చూపించింది.

ప్రభాస్ రాబోయే ప్రాజెక్టులు, సాలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ఆదిపురుష్ సినిమాలను 300, 400 కోట్లకు పైగా బడ్జెట్లతో నిర్మిస్తున్నారు. దీనిని బట్టే ప్రభాస్ క్రేజ్ ఎంత ఉందో మనకి అర్ధం అవుతుంది. మరే ఇతర దక్షిణ భారత నటుడు అందుకొని విధంగా ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు అందుకోబోతునట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss