Sunday, June 13, 2021

Latest Posts

బాహుబలి తర్వాత మరో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ప్రభాస్

Prabhas Trend Set In Tollywood
మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ అనే చిత్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి ఒక  పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. లోకేశ్ ప్రభాస్‌ కి  ఆకట్టుకునే కథాంశాన్ని వివరించాడని, బాహుబలి స్టార్ దీనికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా బహుభాషా చిత్రంగా ఉండబోతోంది. ఈ చిత్రం 2022లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ తో బిజీగా ఉన్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 3 డి మిథాలజికల్ చిత్రం ఆదిపురుష్‌ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇకపోతే ప్రభాస్ నాగ్ అశ్విన్‌తో ఒక చిత్రం చేయాల్సి ఉంది. సో ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్ అయిపోతే ఒకేసారి నాగ్ అశ్విన్, లోకేశ్ సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే బాహుబలి తో టాలీవుడ్ బిగ్ బడ్జెట్ ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు పెద్ద హీరోలు ఒకే సారి రెండు సినిమాలు చేయడం ట్రెండ్ సెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ ట్రెండ్ ని ఎంత మంది బిగ్ హీరోలు ఫాలో అవుతారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss