Monday, May 10, 2021

Latest Posts

రంగమ్మత్తపై ప్రదీప్ చూపుల వెనుక అర్ధం ఏమిటో….

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎంత హాట్ అంటే చెప్పలేం అని కొందరు  అంటారు.  ఇక  ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి.  అటు బుల్లి తెర ఇటు వెండి తెరను షేక్ చేస్తున్న  ఈ అమ్మడు  ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న లోకల్ గ్యాంగ్స్ కామెడీ షో లో జడ్జ్ అవతారం ఎత్తింది. ఈ షోకు ప్రదీప్ హోస్ట్ గా ఉన్నాడు. మరి అల్లరి ప్రదీప్ ఏ స్థాయిలో సందడి చేస్తాడో కూడా తెలుసుగా. ప్రదీప్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడైనా అదిరిపోవాల్సిందే. లోకల్ గ్యాంగ్స్ లో అనసూయపై ప్రదీప్ వేసే పంచ్ లు బాగా పేలుతున్నాయి.

రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత అనసూయకు వెండి తెరపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కూడా ఈమె సిద్దంగా ఉంది. అలాంటి కథలు కూడా వింటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఈ అమ్మడు బుల్లి తెర,  వెండి తెరలపై చేస్తున్న సందడికి హీరోయిన్స్ కూడా ఔరా అంటున్నారు.

ఇటీవల ఎపిసోడ్ లో అనసూయ,ప్రదీప్  కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. హాట్ కాస్ట్యూమ్స్ తో వచ్చిన అనసూయను ఆట పట్టిస్తూ వెనుక నుండి  దొంగ చూపులు చూసాడు. అంతటితో వదలకుండా  ప్రదీప్ ఈ ఫొటోలను తన ఇన్ స్టా లో షేర్ చేశాడు. హాట్ గా ఉన్న  ఈ ఫొటోకు వీరలెవెల్లో  కామెంట్స్ పడ్తున్నాయి. ప్రదీప్ ఎందుకు ఆ దొంగ చూపులు అంటూ కొందరు.. పెళ్లి చేసుకుంటే ఈ దొంగ చూపులు తప్పుతాయిగా  అంటూ మరి కొందరు ప్రదీప్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss