Prakasam District Road Accident
ఏపి ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు డీ కొట్టడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టూరుకు సమీపంలోని నేషనల్ హైవే పై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పర్వతనేని వెంకట విజయ లక్ష్మి, ఆర్.కనకమహాలక్ష్మి, బలిజ సత్యన్నారాయణ, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఉయ్యూరు చినబాబు, సందీప్‌తో పాటు మరో వ్యక్తి తిరుమలకు వెళ్లి కారులో ఊరికి తిరిగివస్తున్నారు.
ఇలా తిరిగివస్తుండగా గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని జాతీయరహదారి పై ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోనే మృతదేహలు చిక్కుకుపోవడంతో పోలీసులు, హైవే సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి: