Monday, May 10, 2021

Latest Posts

కరోనా సమయంలో తన శైలిలో సేవ చేస్తున్న ప్రకాష్ రాజ్

Praksh raj doing a great job aid corona virus :

ఈ కష్ట సమయంలో కరోనా లొక్డౌన్ లో ఉన్న నిరుపేదలకు సాయం చెయ్యడంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముందున్నారు. తనకు ఎటువంటి విరాళాలు పంపవద్దని మీరు పంపాల్సిన విరాళాలు నేరుగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టె ఛారిటీలకు పంపించాలను పేర్కొన్నారు. తనకు చెన్నై నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు ఫోన్ చేసి ఎల్లెక్షన్స్ లో మీరు నుంచుంటే బావుంటుంది అని అన్నారని, నేను ఎటువంటి సమయంలో ఇటువంటి పనులేంటి అని వారించానని, ముందు సినీ కార్మికుల గురించి ఆలోచించమని చెప్పానని ప్రకాష్ రాజ్ అన్నారు.

ప్రస్తుతం  హైదరాబాద్ లో తన ఫామ్ హౌస్లో క్వారంటైన్ పీరియడ్ లో ఉన్నానని, కానీ చెన్నైలో బెంగళూరులో తన చారిటీ సభ్యులు శరణార్థులకు నిత్యవసర వస్తువులు అందచేస్తూ సాయం చేస్తున్నారని, వారికి కావాల్సిన ఫండ్ ను నేను పంపిస్తున్నానని, ఎవరైనా ఫండ్ ఇవ్వాలనుకుంటే వారికి నేరుగా పంపాలని పేర్కొన్నారు. కాగా సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడిన రోజు వారి కార్మికులు గురించి ఇండియా మొత్తం సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలు బయటకు వచ్చి ఆలోచించాలని, ఇప్పటికే చిరంజీవి గారు టాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ గారు అల్ ఓవర్ ఇండియా మొత్తం సినీ కారిమికులకు అండగా ఉన్నారని, అలాగే ముందు ముందు రాగల వర్షం కాలం పాటు ఆ కార్మికులను ఆదుకోవడానికి ఆలోచన చెయ్యాలని అన్నారు. అల్లు అరవింద్ గారు డిసెంబర్ వరకు జనాలు ధియేటర్ కి రావడం కష్టం అన్నందుకు సమాధానంగా ఆయన అన్నది నిజం అని వారి అనుభవంతో దీనికి ఎలా ఓవర్ కం చెయ్యవులనే ఆలోచన అందరం కలిసి చెయ్యాలని ప్రకాష్ రాజ్ అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss